బిఆర్ఎస్ హయాంలోనే నెల్లికల్ లిఫ్ట్ కు శంకుస్థాపన

July 6, 2026 | తెలంగాణ

జనం న్యూస్- జులై 6- నాగార్జునసాగర్ టౌన్- నాగార్జునసాగర్ సమీపంలోని నెల్లికలు లిఫ్ట్ ఏర్పాటు ఆలోచన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచననే అని ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి అన్నారు. శనివారం ఇరిగేషన్ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నెల్లికల్ లిఫ్ట్ ఇరిగేషన్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఫలితమైన అని పేర్కొనడం హాస్యాస్పదమని అన్నారు. స్థానిక విజయ్ విహార అతిథి గృహంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ మంత్రులు బిఆర్ఎస్ హయాంలో ఇరిగేషన్ ప్రాజెక్టులను బ్రష్టు పట్టించారని అబద్ధాలు చెబు తున్నారని, అట్టి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. బిఆర్ఎస్ అధికారం చేపట్టిన 2021లో నెల్లికలు లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు శంకుస్థాపన చేశారన్నారు. సాంకేతికపరమైన సామాగ్రి కొరత కారణంగానే పనులు ఆలస్యమ య్యాయని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వo నెల్లికల్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను తామే మూల కారణమని చెప్పుకోవడం సరికాదని అన్నారు. ఈ సమావేశంలో ఆయన వెంట బిఆర్ఎస్ పార్టీ నాయకులు కడారి అంజయ్య రమేష్ జి చంద్రమౌళి నాయక్ సైదులు ఆదాసు విక్రం విజయ్ మంద శాంత తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper