బిచ్కుంద మాజీ ఎంపీపీ సాయిలు కుటుంబాన్ని పరామర్శించిన
డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్— డెలికేట్ విట్టల్ రెడ్డి
బిచ్కుంద ఆగస్టు 5 జనం న్యూస్కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని బిచ్కుంద మండలం వాజిద్నగర్ గ్రామానికి చెందిన బిచ్కుంద మండల మాజీ ఎంపీపీ శ్రీ సాయిలు నాలుగు రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ ఈరోజు వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఈ సందర్భంగా ఏలే మల్లికార్జున్ గారు, సాయిలు సేవలను స్మరించుకున్నారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఈ క్లిష్ట సమయంలో కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు.ఈ కార్యక్రమంలో అధ్యక్షునితోపాటు డెలికేట్ విట్టల్ రెడ్డి వాజిద్ నగర్ సర్పంచ్ గోపాల్ రెడ్డి పటేల్ పుల్కల్ సర్పంచ్ సంతోష్ పటేల్ వాజిద్ నగర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు మరియు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.