బిచ్కుంద లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
బిచ్కుంద మే 21 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో ని మార్కెట్ కమిటీ యార్డులో రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా బిచ్కుంద మున్సిపల్ చైర్మన్ సీమ సెట్ కార్ మరియు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాగనాథ్ ఆధ్వర్యంలో మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా నాయకులతో కలసి ఆయన చిత్రపటానికి పూలమాల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మాట్లాడుతూ… దేశంలో సాంకేతిక విప్లవానికి ఆజ్యం పోసి, కంప్యూటర్ యుగానికి నాంది పలికారని అన్నారు. దూరదృష్టితో సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి, ఆర్థిక వ్యవస్థను సరళీకృతం చేయడం, పరిశ్రమలకు రాయితీలు, పంచాయతీరాజ్ వ్యవస్థ పటిష్టం చేయడం వంటి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారని కొనియాడారు. మహిళా రిజర్వేషన్లు తీసుకొచ్చిన ఘనత ఆయనకే చెందుతుందన్నారు. అతి చిన్న వయసులోనే ప్రధాని పీఠాన్ని అధిరోహించి, దేశ భవిష్యత్తుకు నాడు నాటిన మొక్కలు నేడు వృక్షాలై ఫలాలు అందిస్తున్నాయన్నారు. యువతలో శక్తివంతమైన మార్పును కోరుకున్నారని గుర్తు చేశారు. నేడు ప్రజా ప్రభుత్వం రాజీవ్ గాంధీ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షునితో పాటు బిచ్కుంద కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి కౌన్సిలర్ నోషా నాయక్ గంగాధర్ మునిసిపల్ కోఆప్షన్ నెంబర్ అసద్ అలీ చింతల్ హనుమాన్లు సాయిల్ సెట్ కార్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ అశోక్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ అజయ్ పటేల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…..