బూత్ స్థాయి నుండి పార్టీ బలోపేతం చేద్దాం : అలవరం బిజెపి సమావేశం
జనం న్యూస్: ఆగస్టు 7 ముమ్మిడివరం ప్రతినిధి (గ్రంధి నానాజీ)డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గంఅలవర మండలం అల్లవరం గ్రామంలో మండల అధ్యక్షులు కట్ట నారాయణమూర్తి అధ్యక్షతన, మండల ఇంచార్జి మోకా వెంకట సుబ్బారావు ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ మండల కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా ఎస్.ఐ.ఆర్ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త సంసాని రత్నకుమార్ పాల్గొని మాట్లాడారు. బూత్ స్థాయి నుండి పార్టీని బలోపేతం చేయాలని కార్యకర్తలకు పిలుపు ఇచ్చారు. ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ఈ నెల 30న ముగుస్తున్నందున ప్రతి గ్రామంలో ఓటర్ జాబితా సరిచూసి ఓటర్లను చేర్చడం, మార్పులు, తొలగింపులు చేయాలని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించేలా కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు సుంకర సాయి, గుడాల పుల్లయ్య శెట్టి, వెనుకబడిన తరగతుల విభాగం మండల అధ్యక్షులు మొల్లేటి రామ్ కుమార్, కట్టా జనార్దన్ రావు, కంకిపాటి సాయిరాం, బండిగుప్తాపు శ్రీనివాస్, ఆకుల రామారావు, బండిగుస్తాబు సుబ్బరాజు, మేకల చంటి మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.