మనిషికి ఏ విషయంలోనైనా కొత్త పద్ధతిలో క్షుద్ర పూజలు
జనం న్యూస్ 16 జూలై 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా జోగులాంబ గద్వాల జిల్లా కార్యదర్శి బి.ఆంజనేయులు పొలంలో క్షుద్ర పూజలు నిన్న అమావాస్య కావడంతో గుర్తుతెలియని వ్యక్తులు రాత్రి సమయంలో కొత్త పద్ధతిలో క్షుద్ర పూజలు చేయడం దేనికి సంకేతం అని చుట్టుపక్కల ప్రజలు.రైతులు ప్రశ్నిస్తున్నారు గద్వాల జిల్లా గట్టు మండలం చాగదోన గ్రామ శివారులో ఉన్న సిపిఐ జోగులాంబ గద్వాల జిల్లా కార్యదర్శి పొలాన్ని వారి సొంత అన్నగారు ప్రతి సంవత్సరం పంటలు పండించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా పొలంలో ప్రత్తి పంటను సాగు చేయడం జరుగుతుంది.ఈ తరుణంలో గుర్తుతెలియని దుండగులు ఇలా చేయడం ఏంటని సోషల్ మీడియా ద్వారా బాధితులు రైతులు, ప్రజలు ప్రశ్నిస్తున్నారు క్షుద్ర పూజలు చేసే వారికి విన్నపం ఈరోజు రాజకీయ నాయకులు రకరకాల దోపిడీలు కబ్జాలు చేస్తున్నారు వారికి చేయలేరా క్షుద్ర పూజలు. పదేపదే ఎమ్మెల్యేల గాను ఎంపీలగాను గెలిచి ప్రజాధనాన్ని అలాగే అందరికీ హక్కు ఉండే సహజవరులైన సహజ సంపదను ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి దోచుకుంటున్నారు రకరకాల రేపిస్టులు రౌడీలు తయారవుతున్నారు ఇలాంటి వారికి బుద్ధి చెప్పడానికి మీరు క్షుద్ర పూజలు చేయలేరా అలాంటి వారికి మీ క్షుద్ర పూజలు పనిచేయవా వర్తించవా సన్నాసులకు బుద్ధి చెప్పడానికి మీరు క్షుద్ర పూజలు చేయలేరా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.