మామిడి కుదురు తాసిల్దార్ కార్యాలయంలో బిజెపి కార్యకర్తలు ఆధ్వర్యంలో ఎమ్మార్వో చే మొక్క నాటించినారు
జనం న్యూస్ జూన్ 6( ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం నూతన తహసీల్దార్ గా పదవి బాధ్యతలు తీసుకున్న సి ఎస్ రాజు వారిని మండల బిజెపి నాయకులు కలిసి దశ్శాలువలుతో సత్కరించడం జరిగింది. అనంతరం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తాసిల్దార్ కార్యాలయ ప్రాంగణంలో తాసిల్దార్ సి ఎస్ రాజ వారిచే మొక్క నాటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పసుపులేటి మహాలక్ష్మి రావు భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షలు సానబోయిన సత్యనారాయణ సోషల్ మీడియా కన్వీనర్ అంకం నాగ పల్లేశ్వరరావు ఓ బి సి మోర్చ మండల అధ్యక్షుడు ఏడిద బాబులు మండల ఉపాధ్యక్షులు పాబోలు రామలింగేశ్వరరావు మండల ట్రజరర్ పెద్దిరెడ్డి శ్రీనివాస్ మండల కిసాన్ మోర్చా రు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.