మీర్జాపేట & కారుమానుపల్లి గ్రామాలలో పొలం పిలుస్తోంది కార్యక్రమం మండల వ్యవసాయ అధికారి పి జోష్నాదేవి
జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఆగస్టు 5పీఎంఫబయ్ పంటల భీమా పథకం రైతులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. ఆగస్టు 15 వ తేదీ వరకు పెంచిన గడువు గుర్తించి రైతులు సాగు చేసిన పంటలకు ప్రీమియం చెల్లించాలని తెలియజేశారు. విత్తన తరువాత తప్పనిసరిగా ఈ క్రాప్ నమోదు చేయించుకోవాలని సూచించారు. బోర్లలో నీరు సమర్థవంతంగా వినియోగించ టానికి రైతులు డ్రిప్ ఇరిగేషన్ అలవాటు చేసుకోవాలని తెలియజేశారు. వరి, ఎండుమిరప సాగు తగ్గించి, స్వల్పకాలిక ఆరుతడి పంటలు తక్కువ నీటితో పండించుకునే పంటలను సాగుచేయాలని రైతులకు తెలియజేశారు. మిర్చి నాట్లు వేసే పొలాలను సందర్శించారు.కార్యక్రమంలో వి ఏ ఏ గణేష్, రైతులు పాల్గొన్నారు.