రాజంపేట సబ్ కలెక్టర్ ను కలిసిన నందలూరు సిటిజన్ అసోసియేషన్ సభ్యులు
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా 08-06-26నందలూరు మండల తహసీల్దార్ కార్యాలయం నందు సిబ్బంది కొరత వల్ల మండల ప్రజలు ఇబ్బందులకు గురవు తున్నారు కార్యాలయం నందు టైపిస్టు, కంప్యూటర్ ఆపరేటర్, మరియు వీఆర్ఏల, కొరత ఉండడం మూలాన పనులు ఆలస్యమై రైతులు ప్రజలు మరియు విద్యార్థులు చాలా ఇబ్బందులు గురవుతున్నారు కావున రాజంపేట సబ్ కలెక్టర్ కు వినయ పూర్వకముగా విన్నవించుకోవడం ఏమనగా సిబ్బందిని నియమించినట్లు తగు చర్యలు తీసుకోవాలని సిటిజన్ నందలూరు అసోసియేషన్ సభ్యులు తెలిపారు ఈ కార్యక్రమంలో సిటిజన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఏ విశ్వనాథ్ జనరల్ సెక్రెటరీ సయ్యద్ అమీర్ హిమగిరినాథ్ జుల్ఫికర్ తదితరులు పాల్గొన్నారు