విద్యార్థి వైద్యానికి ఆర్థిక సాయం –తల్లికి ఉద్యోగం

July 29, 2026 | తెలంగాణ

మరో బాధిత కుటుంబానికి ఆర్థిక చేయూత


జనం న్యూస్ జూలై 29 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) కష్టాల్లో ఉన్న కుటుంబాలకు అండగా మంత్రి వాసంశెట్టి సుభాష్ రామచంద్రాపురం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. కష్టాల్లో ఉన్న రెండు కుటుంబాలకు మొత్తం రూ.25,000 ఆర్థిక సహాయం అందించడంతో పాటు, ఓ కుటుంబానికి ఉపాధి కల్పించి అండగా నిలిచారు.స్థానిక గుబ్బలవారి పేటకు చెందిన పదో తరగతి విద్యార్థి కొమరపు నితిన్ తేజ ఇటీవల విద్యుత్ షాక్‌కు గురై తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న మంత్రి వెంటనే స్పందించి రూ.15,000 ఆర్థిక సహాయం అందించారు. అంతేకాకుండా, బాలుడి తల్లి గంగాభవానికి వెంటనే ప్రైవేట్ ఉద్యోగం కల్పించి ఆ కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించారు.అలాగే, 18వ వార్డుకు చెందిన గొలకోటి సత్యనారాయణ అనారోగ్యంతో మంచానికే పరిమితమైన విషయం స్థానిక నాయకుల ద్వారా తెలుసుకున్న మంత్రి, ఆయనకు రూ.10,000 ఆర్థిక సహాయం చెక్కు అందించి, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.ఆపదలో ఉన్న ప్రజల పట్ల మంత్రి సుభాష్ చూపుతున్న మానవీయ దృక్పథం, తక్షణ స్పందనను ఆయా కుటుంబ సభ్యులు, కూటమి పార్టీ నాయకులు అభినందిస్తూ ఆయనకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి సుభాష్ వెంట ఏఎంసీ చైర్మన్ అక్కల రిశ్వంత రాయ్ , పట్టణ టిడిపి అధ్యక్షులు ఉండవెల్లి శివ, క్లస్టర్ 2 ఇన్చార్జి కంచుమర్తి బాబురావు, దంగేటి గౌరీ శంకర్,కవల నానాజీ, దిగుమర్తి వీరబాబు,గుబ్బల వెంకటరమణ, మంగతాయారు, కూటమి పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper