శ్రీ తమిరిశ రామాచార్యులు శతజయంతి ఉత్సవం
జనం న్యూస్ సెప్టెంబర్ 10 ముమ్మిడివరం ప్రతినిధి తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రం, తెనాలిలో శ్రీ తమిరిశ రామాచార్యులు శతజయంతి ఉత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా మాజీ టొబాకో బోర్డు చైర్మన్ యడ్లపాటి రఘునాథ బాబు వ్యవహరించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు , బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీ.వీ.ఎన్. మాధవ్ , ఆర్ఎస్ఎస్ సహ కార్యవాహ జనార్దన్ , ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ , బీజేపీ గుంటూరు జిల్లా ఇన్చార్జ్ యాళ్ల దొరబాబు , మాజీ ఎమ్మెల్యే నన్నపునేని రాజకుమారి ,స్వరూప రాణి, బీజేపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతి రావు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా తమిరిశ రామాచార్యులు సేవలను, ప్రజాజీవితంలో వారు అందించిన విశేష కృషిని స్మరించుకుంటూ ఘనంగా నివాళులు అర్పించారు. వారి సేవా స్ఫూర్తిని స్మరించుకుంటూ, వారి ఆశయాలు నేటి తరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు