చిట్కుల్లో మేకలు గొర్రెల సంత ప్రారంభోత్సవం

September 10, 2026 | తెలంగాణ

జనం న్యూస్ సెప్టెంబర్ 10 చిలిపిచేడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం చిట్కుల్ గ్రామంలో గురువారం సంత నిర్వహించారు ఇంతకుముందుగా కూరగాయలు అందుబాటులో ఉండేవి అలాంటిది చిట్కుల్ గ్రామంలో గొర్రెలు మేకలు తక్కువ ధరలో లభించే విధంగా ఈ మార్కెట్ ఏర్పాటు చేశామని తెలిపారు గురువారం మేకలు గొర్రెల సంత ప్రారంభించారు గ్రామపంచాయతీ పాలకవర్గం సభ్యులు ఈ మేకల సంత కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు ప్రతి గురువారం గ్రామంలో మేకలు గొర్రెలు, విక్రయించుకునేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు ప్రజలకు దూర ప్రాంతాల వారికి ఎంతో అనుకూలంగా ఉంటుందని పాలకవర్గం నిర్ణయించారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాములు ఉప సర్పంచ్ అఖిల్ నూతన పాలకవర్గం తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

🌐 Select Language:
📰 ePaper