సత్తూరు కుటుంబాన్ని పరామర్శించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్ గౌడ్

June 30, 2026 | తెలంగాణ

జనం న్యూస్, జూన్ 30 | తెలంగాణ స్టేట్ ఇన్‌చార్జ్: శ్రీనివాస్ రెడ్డి ; శేర్లింగంపల్లి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శిరీష సత్తూరు అత్త, ప్రముఖ వైద్యులు డాక్టర్ సత్తూరు నవీన్ కుమార్ తల్లి సత్తూరు ఎల్లమ్మ ఇటీవల కన్నుమూశారు. ఈ విషాద వార్త తెలుసుకున్న శేర్లింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్ గౌడ్ మంగళవారం మహబూబ్‌నగర్‌లోని వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా సత్తూరు ఎల్లమ్మ చిత్రపటానికి నివాళులర్పించిన జగదీశ్వర్ గౌడ్, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, వారి కుటుంబానికి మనోధైర్యం కల్పించేలా ఓదార్పు మాటలు చెప్పారు. ఈ కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ కుటుంబానికి అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.అనంతరం డాక్టర్ సత్తూరు నవీన్ కుమార్ సోదరులు, మహబూబ్‌నగర్ శ్రీకృష్ణ థియేటర్స్ యాజమాన్య సభ్యులు సత్తూరు కృష్ణబాబు గౌడ్, వేణుగోపాల్ గౌడ్, శ్యాంసుందర్ గౌడ్, సికింద్రాబాద్ అజంతా టాకీస్ యజమాని భీమల్ గౌడ్‌తో పాటు ఇతర కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి ధైర్యం చెప్పారు.ఈ కార్యక్రమంలో పట్వారి శశిధర్, మన్నెపల్లి సాంబశివరావు, కావూరు ప్రసాద్, బోయపల్లి నారాయణ తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper