హెచ్ ఏ ఎంప్రాజెక్టులో నర్సాపూర్ రికార్డు – రూ.176.85 కోట్లతో 163.07 కి.మీ. రహదారులకు మంజూరు

July 7, 2026 | తెలంగాణ

జనం న్యూస్ జూలై 7 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడు మండలంతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్ హెచ్ ఏ ఎం హైబ్రిడ్ యూనిటీ మాడలప్రాజెక్టు కింద నర్సాపూర్ నియోజకవర్గం రాష్ట్రంలోనే విశేష గుర్తింపు పొందింది. ఈ ప్రాజెక్టు ద్వారా రూ.176.85 కోట్ల వ్యయంతో మొత్తం 163.07 కిలోమీటర్ల రహదారి పనులకు మంజూరు లభించింది. ఈ పనులు త్వరలోనే ప్రారంభం కానుండటంతో నియోజకవర్గ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.ఈ రహదారి పనుల ద్వారా గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన అను సంధానం, ప్రయాణ సౌలభ్యం, వ్యవసాయ ఉత్పత్తుల రవాణా, వాణిజ్య అభివృద్ధికి విశేష ప్రోత్సాహం లభించనుంది. నర్సాపూర్ నియోజకవర్గ అభివృద్ధిలో ఇది ఒక చారిత్రాత్మక ముందడుగుగా నిలవనుంది.ఈ సందర్భంగా నర్సాపూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి శ్రీ ఆవుల రాజిరెడ్డినర్సాపూర్ నియోజకవర్గ ప్రజల తరఫున ఈ రహదారుల మంజూరుకు సహకరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి ఆర్ అండ్ బి శాఖ మంత్రికోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క గారికి, జిల్లా మంత్రి దామోదర రాజనర్సింహ గారికి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి శ్రీ వివేక్ వెంకటస్వామి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.నర్సాపూర్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి తమ కృషి నిరంతరం కొనసాగుతుందని, ప్రజలకు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు తీసుకురావడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు

🌐 Select Language:
📰 ePaper