హోతి (బి )లో చురుకుగా కొనసాగుతున్న అండర్ డ్రైనేజ్ మరియు సిసి రోడ్డు పనులుపరిశీలించిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు
జనం న్యూస్ 07-07-2026 జహీరాబాద్ మండలంలోని హోతి బి గ్రామంలో అండర్ డ్రైనేజ్ పనులు చురుకుగా కొనసాగుతుండగా గ్రామ సర్పంచ్ మచ్చే0దర్ గార్లతో కలిసి పనులను పర్యవేక్షిస్తున్న మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గుండప్ప జహీరాబాద్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ ఈ సందర్బంగా సర్పంచ్ దాసరి మచ్చేందర్ మాట్లాడుతూ కొన్ని సంవత్సరాలుగా మురికి కాలువలు లేక ఇబ్బంది పడుతున్న ప్రజలకు సర్పంచ్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు స్థానిక శాసన సభ్యులు కొనింటి మాణిక్ రావు సహకారంతో అండర్ డ్రైనేజ్. మరియు సిసి రోడ్డు పనులను చేపడుతున్నట్లు మిగిలిన పనులను కూడా దశల వారీగా పూర్తి చేయనున్నట్లు తెలిపారు కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు పర్వేజ్ పటేల్ మాజీ సర్పంచ్ చిన్నా రెడ్డి ఉప సర్పంచ్ విష్ణు , చంద్రు ,మల్లన్న, షేక్ అలీ తదితరులు పాల్గొన్నారు…