సిగ్నస్ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభోత్సవం అందుబాటు ధరల్లో నాణ్యమైన వైద్యం అందించాలి: బండి రమేష్

August 26, 2026 | వైరల్ వార్తలు

జనం న్యూస్ ఆగస్టు 26 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలోని సర్దార్ పటేల్ నగర్, నిజాంపేట్ క్రాస్ రోడ్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన సిగ్నస్ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి టీపీసీసీ ఉపాధ్యక్షులు, తెలంగాణ కమ్మ కార్పొరేషన్ చైర్మన్, కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ ముఖ్య అతిథిగా హాజరై ఆసుపత్రిని ప్రారంభించి, మేనేజ్‌మెంట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ.. ప్రజలకు అందుబాటు ధరల్లో మెరుగైన వైద్య సేవలు అందిస్తూ ఆసుపత్రి మంచి పేరు సంపాదించుకోవాలని ఆకాంక్షించారు. నేటి పరిస్థితుల్లో నాణ్యమైన వైద్యం సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఆసుపత్రి యాజమాన్యం సేవా దృక్పథంతో ముందుకు సాగాలని సూచించారు. ప్రారంభోత్స వ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గొట్టుముక్కల వెంకటేశ్వరరావు, మాకినేని వినోద్, శ్రీనివాస్ బాబు, సత్యనారాయణ, గాదె శివ తదితరులు పాల్గొని ఆసుపత్రి యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. ఆసుపత్రి ఆధునిక వైద్య సేవలతో ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించాలని పలువురు ఆకాంక్షించారు.

🌐 Select Language:
📰 ePaper