నాగార్జునసాగర్ ప్రాజెక్టు పై మరోసారి జలవివాదానికి తెరలేపిన ఏపీ ఇరిగేషన్ అధికారులు

August 26, 2026 | తెలంగాణ

జనం న్యూస్- ఆగస్టు 26- నాగార్జునసాగర్ టౌన్-నాగార్జునసాగర్ డ్యాం వద్ద కృష్ణా జలాల వినియోగంపై మరోసారి ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. కృష్ణ రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కెఆర్ఎంబి) ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఆంధ్రప్రదేశ్,నీటిపారుదల శాఖ అధికారులు తాగునీటి అవసరాల నిమిత్తం బుధవారం ఉదయం పవర్ జనరేషన్ ద్వారా కుడి కాలువకు నీటిని విడుదల చేశారు, విషయం తెలుసుకున్న తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు సైతం తాగునీటి అవసరాల కోసం ఎడమ కాలువకు నీటిని విడుదల చేశారు, కెఆర్ఎంబి అనుమతులు లేకుండా ఏపీ అధికారులు నీటిని విడుదల చేయడంపై తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. నీటి విడుదల నేపథ్యంలో ఇరు రాష్ట్రాల మధ్య ఎలాంటి వివాదాలు ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద పోలీసులు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ చిరు రాష్ట్రాల అధికారుల మధ్య ఇలాంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా భద్రతా చర్యలు చేపట్టారు, ప్రస్తుత సమాచారం ప్రకారం నాగార్జునసాగర్ కు ఇన్ ఫ్లో 22,530, క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 3660 క్యూసెక్కులు, పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 536.50 అడుగులుగా నమోదయింది. ప్రస్తుత నీటి నిల్వ 151.1140 టీఎంసీలు, కుడికాలు ద్వారా ఒక వెయ్యి1660 క్యూసెక్కుల నీటి విడుదల, శ్రీశైలం లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ (ఏఎమ్ఆర్పి) ద్వారా 2000 క్యూసెక్కుల నీటి విడుదల గా ఉంది.

🌐 Select Language:
📰 ePaper