ePaper

అవమానాలు కొత్తేంకాదన్నయాంకర్ రశ్మి…

May 3, 2026 | సినిమా వార్తలు

జనం న్యూస్ :యాంకర్, నటి రష్మీ గౌతమ్‌కి వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య సోషల్ మీడియాలో వార్ నడుస్తోంది. ఎడ్లబండిపై ఆటో, జనాలను ఎక్కించి వైసీపీ నేత భూమన అభినయ్ రెడ్డి నిరసన కార్యక్రమం చేపట్టడంపై రష్మీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎద్దుపడ్డ ఆవేదన ఈ మనసులపై వెయ్యి రెట్లు ఎక్కువగా పడాలంటూ శాపనార్థాలు పెట్టింది. ఇందుకు కౌంటర్‌గా వైసీపీ అభిమానులు సోషల్ మీడియా వేదికగా రష్మీపై మాటల దాడికి దిగుతున్నారు. రష్మీని ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ ట్రోలింగ్‌పై యాంకర్ రష్మీ స్పందించింది. తాను ఏ మతానికి.. .ఏ పార్టీకి వ్యతిరేకం కాదని జంతువులపై కృరత్వానికి మాత్రమే తాను వ్యతిరేకం అని యాంకర్ రష్మీ గౌతమ్ తెలిపింది. ట్రోలింగ్ నాకేం కొత్త కాదు: ట్రోలింగ్, విమర్శలు ఎదుర్కోవడం తనకేమీ కొత్త కాదు అని గతంలోనూ అనేక సందర్భాలలో వేధింపులకు గురైనట్లు రష్మీ తెలిపింది. నా సోషల్ మీడియా ప్రొఫైల్స్ మెుత్తం గమనిస్తే తాను ఎదుర్కొన్న అవమానాలు బయటపడతాయని అన్నారు. పండుగల సమయంలో జరిగి జంతుబలిపై కూడా తాను తన నిరసన గళాన్ని వినిపిస్తూనే ఉంటానని చెప్పుకొచ్చారు. అప్పుడు కూడా తనను తిట్టారు. చివరకు గణపతికి గజమాల వేసే క్రమంలో అంకుశంతో ఏనుగు చర్మాన్ని చీల్చుతుంటే దానిపై ప్రశ్నించినందుకు తనను దేశద్రోహ అని పిలిచారని యాంకర్ రష్మీ గుర్తు చేశారు. జంతువులపై జరిగే హింస విషయంలో ప్రజలు ఒక అంశాన్ని మరోకదానితో పోలుస్తూ కాలక్షేపం చేస్తున్నారే తప్ప పరిష్కారం గురించ ఆలోచించడం లేదు అని యాంకర్ రష్మీ చెప్పుకొచ్చారు.