ePaper

భర్త చనిపోయిన నెల రోజులకే ప్రియుడిని పెళ్లాడిన రేణుక: సీతారాం సూసైడ్ కేసులో దర్యాప్తులో సంచలన విషయాలు

May 3, 2026 | క్రైమ్ వార్తలు

జనం న్యూస్: సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సీతారాం సూసైడ్ కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. భార్య వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం…ఏకాంతంగా ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో పెట్టడంతో తట్టుకోలేకపోయిన టెకీ సీతారాం 19 పేజీల సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. తన చావుకు తన భార్య వివాహేతర సంబంధాలే కారణమని…తన భార్యకు ముగ్గురితో అక్రమ సంబంధం ఉందని… ఒకరితో ప్రైవేట్‌గా ఉన్న వీడియోలను రికార్డ్ చేసింది. ఆ వీడియోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు అని సీతారాం సూసైడ్‌నోట్‌లో రాసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ సూసైడ్ నోట్ ఆధారంగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగి రేణుకతోపాటు ఆమె ప్రియులు రమణారెడ్డి, శ్రవణ్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. భర్త చనిపోయిన నెలరోజులకే రేణుక ప్రియుడిని పెళ్ళి చేసుకున్నట్లు తేలింది.

భర్త చనిపోయిన నెలరోజులకే ప్రియుడిని పెళ్లాడిన రేణుక: సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సీతారం సూసైడ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. భర్త చనిపోయిన తర్వాత రేణుక సంచలన నిర్ణయం తీసుకుంది. భర్త ఆత్మహత్య చేసుకుని చనిపోయిన నెలరోజులు తిరగకముందే అంటే మార్చిలో రేణుక తన ప్రియుడు అయిన రమణారెడ్డిని పెళ్లాడినట్లు పోలీసుల విచారణలో తేలింది. అయితే ఈ పెళ్లి విషయాన్ని అత్యంత రహస్యంగా ఉంచినట్లు తేలింది. అంతేకాదు వీరిద్దరు కలిసి పెళ్లి చేసుకున్నట్లు ఆధారాల కోసం ఫోటోలు కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ ఫోటోలు సైతం బయటకు వచ్చాయి. భర్త చనిపోయిన నెలరోజులు కాకముందే మరో ప్రియుడిని పెళ్లి చేసుకోవడంపై జనాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేణుక అసలు మనిషేనా? అని ప్రశ్నిస్తున్నారు. రేణుకకు కావాల్సింది మంచి భర్త కాదు అని శృంగారం అంటూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా తిట్టిపోస్తున్నారు.