50%రాయితీ పై పచ్చి రొట్ట విత్తనాలు పంపిణీ.మండల వ్యవసాయ అధికారి పి జోష్నాదేవి.

June 9, 2026 | తెలంగాణ

జనం న్యూస్. తర్లుపాడు మండలం జూన్ 9 ; తర్లుపాడు మండలంలోని రైతు సేవ కేంద్ర సిబ్బంది వద్ద రిజిస్ట్రేషన్ మరియు నగదు చెల్లింపులు పూర్తి చేసిన కలుజువ్వలపాడు, తుమ్మలచెరువు, తాడివారిపల్లి, తర్లుపాడు రైతులకు మండల వ్యవసాయ అధికారి మరియు రైతు సేవ కేంద్రం సిబ్బంది పంపిణీ చేశారు. పచ్చి రొట్ట పైర్లు సాగు చేయుటవలన నేలలో సేంద్రీయ కర్బనము పెరిగి, నీటి నిల్వ సామర్థ్యం పెరిగి, భూమి లోని పోషకాలు అందుబాటు లోనికి వస్తాయి. గాలిలోని నత్రజని స్థిరీకరించటానికి ఉపయోగపడతాయని తెలిపారు. అవసరం ఉన్న రైతులు రైతు సేవ కేంద్రం సిబ్బందిని సంప్రదించి విత్తనాలు పొందవచ్చని తెలిపారు.

🌐 Select Language:
📰 ePaper