జనం న్యూస్ 30 ఆలేరు యాదాద్రి జిల్లా మండల రిపోర్టర్ ఎండి జహంగీర్ ఆలేరు పట్టణంలోని గ్రోమోర్ షాపు ముందు బుధవారం రోజున నకిలీ విత్తనాలను అరికట్టాలని యాజమాన్యంపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ మరియు బిజెపి జిల్లా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతులు ధర్నా నిర్వహించారు వివరాల్లోకి వెళితే ఆలేరు గ్రోమోర్ ఎరువుల సెంటర్ కావేరి కంపెనీకి చెందిన చింటు సన్న రకం వరి విత్తనాలను యాదగిరిగుట్ట మండలం బాహుపేట గ్రామానికి చెందిన పంజాల గోవర్ధన్ తో పాటు దాదాపు 80 మందికి పైగా రైతులు కొనుగోలు చేసి నారు పోసి నాటు వేసి దాదాపు నాలుగు నెలలు పంట కాలం పూర్తి కావచ్చిన చేను పోట్టకు రాకపోవడంతో రైతులు యాదగిరిగుట్ట వ్యవసాయ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించిన అధికారులు విత్తనాలు అమ్మిన యాజమాన్యానికి పొలంలో వరి పంట రాకుండా మొత్తం వడిపల్లి విస్తరించిందని ఈసారి పంట దిగుబడి కాదు అని సూచించి రైతుకు నష్టపరిహారం చెల్లించాలని వివరణ ఇచ్చిన విత్తనాలు అమ్మిన సదరు గ్రోమోర్ సెంటర్ మరియు విత్తన కంపెనీ వారు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో సదరు రైతులు రైతు సంఘాల ఆధ్వర్యంలో న్యాయం చేయాలని పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమం లో పాల్గొ న్నవారు ఐ ఎఫ్ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి గడ్డం నాగరాజు,అరుణోదయ జిల్లా నాయకులు ఇక్కిరి శ్రీనివాస్ బిజెపి జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు బందెల సుభాష్ దశరథ బిజెపి జిల్లా కార్యదర్శి కామిటికారికృష్ణ సంకరి సృజన్ పంజాల మురళి రైతులు తదితరులు పాల్గొన్నారు.