జనం న్యూస్ నందలూరు కడప జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ జి ఎఫ్ ఐ) నందలూరు మండలశాఖ ఆధ్వర్యం లో బుధవారం క్రీడా కారుల ఎంపిక పోటీలు ఎంతో ఉత్సాహ భరితం గా ప్రారంభ మయ్యాయి.స్థానిక నాగిరెడ్డిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలికల జూనియర్ కళా శాలలో ఈ ఎంపికలు జరిగాయి. కబడ్డీ, వాలీ బాల్, యోగ, బ్యాడ్మింటన్ చెస్, తదితర విభాగాల లో జరిగిన పోటీలక మండలం లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యార్థిని విద్యార్థులు హాజరయ్యారు.రాయచోటి డివిజన్ డిప్యూటీ డిఈఓఎల్. నాగయ్య, మండల విద్యాశాఖ అధికారి 2 అనంత కృష్ణ,పాఠశాల ప్రధానోపాధ్యా యులు గంగనపల్లి వెంకట రమణలుఈపోటీలనుప్రారంభించారు. క్రీడాపోటీలలోగెలుపొందిన విద్యార్థులను వారు అభినం దించారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు సురేంద్ర, తేజ, పెంచలయ్య, గౌతమి, సుస్మిత, జగన్, బుచ్చిబాబు, శవశంకర్, కిషోర్, రెడ్డిప్రసాద్, గొంటుముక్కుల వెంకటరమణ, రాజేంద్రతదితరులుపాల్గొన్నారు.