జనం న్యూస్, అక్టోబర్ 01, అచ్యుతాపురం : అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గంలో గల రైతుల వ్యవసాయ పనుల్లో ఏఎంసీ ఛైర్మన్ తట్టా లోవ కుమారి భాగస్వామ్యులయ్యారు. వరిపొలాల్లో కలుపు తీస్తున్న రైతు కూలీలతో మమేకమై ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా ఛైర్మన్ తట్టా లోవ కుమారి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో రైతులకు మేలు జరిగేలా విభిన్న వ్యవసాయ పద్ధతులలో రైతులకు అవగాహన కల్పిస్తుందని, లాభసాటి వ్యవసాయం ద్వారా రైతు ఆర్థికంగా ప్రయోజనం కలుగుతుందని,రైతులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని తెలిపారు.