ఆంధ్రప్రదేశ్

ట్రస్మా ఆధ్వర్యంలో గాంధీజీ జయంతి వేడుకలు

ట్రస్మా ఆధ్వర్యంలో గాంధీజీ జయంతి వేడుకలు

జనం న్యూస్ ;2 అక్టోబర్ శుక్రవారం ; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జ్ వై. రమేష్ ; మహాత్మా గాంధీజీ జయంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా ట్రస్మా కమిటీ ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా ట్రస్మా అధ్యక్షుడు పడిగే భాస్కర్ గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి గాలిపల్లి హరినాథ్, జిల్లా కోశాధికారి జీవరత్నం, వివిధ ప్రైవేట్ పాఠశాలల కరస్పాండెంట్లు, ట్రస్మా జిల్లా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మహాత్మా గాంధీజీ అహింస, సత్యాగ్రహం, శాంతి మార్గాలను దేశ ప్రజలకు చూపారని, ఆయన ఆశయాలను నేటి తరానికి తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అదేవిధంగా సిద్దిపేట పట్టణంలో దేశ మాజీ ప్రధానమంత్రి, జై జవాన్–జై కిసాన్ నినాదాన్ని అందించిన లాల్ బహదూర్ శాస్త్రి విగ్రహం లేకపోవడం విచారకరమని ట్రస్మా ప్రతినిధులు పేర్కొన్నారు. శాస్త్రిజీ సేవలను స్మరించుకునేలా సిద్దిపేట పట్టణంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని వారు కోరారు.

ఇ-పేపర్