ఆంధ్రప్రదేశ్

మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే జీఎస్సార్

మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే జీఎస్సార్

జనం న్యూస్ అక్టోబర్ 2 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మండల కేంద్రంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అనంతరం ఆయన మాట్లాడుతూ పేద, మిక్కిలి బలహీన, బడుగు, బలహీన వర్గాలకు చైతన్యాన్ని ఇవ్వాలని, ఒక మహాత్మా గాంధీని ఆదర్శంగా తీసుకొని, మనమందరం కూడా నవ సమాజం, యువత ఈరోజు పంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పేదలందరినీ సమాంతరంగా ఈ యొక్క ప్రజాస్వామ్య దేశంలో సమాంతరంగా తీసుకురావాల్సినటువంటి అవసరం కూడా ఉంది. గాంధీ , నెహ్రూ ఏదైతే భారతదేశ ప్రభుత్వం, యూపీఏ ప్రభుత్వం. మరి ఈ దేశ స్వతంత్రం కొరకు పోరాడి, బ్రిటీష్, ఇంగ్లీష్ వాళ్ళను తరిమికొట్టి, భారతదేశాన్ని ఏకం చేసినటువంటి గొప్ప మహానీయుని పేరు. మరి ఉపాధి హామీ పథకం కింద ‘మహాత్మా గాంధీ’ అనే పేరును తీసివేయడం చాలా సిగ్గుచేటైనటువంటి విషయం. తీసివేసి ఈరోజు 100 రోజుల పనిని ‘శ్రీరామ్‌ జీ’ అని ఒక పథకాన్ని తీసుకొచ్చి, గాంధీ లాంటి వ్యక్తుల పేరు తీసివేయడం చాలా బాధాకరమైనటువంటి విషయం. తీసివేయడమే కాకుండా, పేదలకు అన్యాయం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాల మీద 40 శాతం రాష్ట్రాలు భరించాలి, 60 శాతం కేంద్రం భరించాలనేటువంటి ఒక ఆలోచన విధానం ఏదైతే ఉన్నదో. మహాత్మా గాంధీ అనే పేరును తీసివేసేటువంటి విధానం ప్రజాస్వామ్యవాదులందరూ కూడా గమనిస్తా ఉన్నారు.
అలాంటి గాంధీ తో పాటు నెహ్రూ 12 సంవత్సరాలు జైలు జీవితం అనుభవించి, స్వతంత్ర పోరాటంలో పనిచేసినటువంటి, మరి ఒక చరిత్ర కలిగినటువంటి, ఆ యొక్క గొప్ప మహానీయుడు… ఆ యొక్క గాంధీ ని ఆదర్శంగా తీసుకొని మనం ముందుకు నడవాలని తెలియజేశారు,.ఈ కార్యక్రమంలో శాయంపేట గ్రామ సర్పంచ్ చింతల ఉమా రవిపాల్ పరకాల వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ (బుజ్జన్న) రవీందర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దూదిపాల బుచ్చిరెడ్డి పత్తిపాక గ్రామ సర్పంచ్ పార్టీ నాయకులు దుబాసి కృష్ణమూర్తి చల్ల చక్రపాణి వరదరాజు ఎండి హైదర్ చేనేత సహకార సంఘ అధ్యక్షులు బాసాని ప్రకాష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఇ-పేపర్