ఆంధ్రప్రదేశ్

పడంపల్లి గ్రామంలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు

పడంపల్లి గ్రామంలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు

జుక్కల్ అక్టోబర్ 2 జనం న్యూస్కా మారెడ్డి జిల్లా జుక్కల్ మండలం పడంపల్లి గ్రామంలో ‘మహాత్మా గాంధీ జయంతి’ వేడుకలు శుక్రవారం రోజు సర్పంచ్ వాగు మారే విజయ్ కుమారి సంజు ఘనంగా నిర్వహించారు జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, భారత స్వాతంత్ర్య ఉద్యమంలో మహాత్మా గాంధీ కీలక పాత్ర పోషించారని, సత్యం, అహింసా సిద్ధాంతాలను ఆయుధాలుగా చేసుకొని ప్రజలను స్వాతంత్ర్య ఉద్యమం వైపు ఏకతాటిపైకి తీసుకువచ్చారని పేర్కొన్నారు. గాంధీజీ చూపిన సత్యం, అహింస, శాంతి, సామరస్యం, ఐకమత్యం వంటి విలువలు నేటి సమాజానికి కూడా ఎంతో అవసరమని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తో పాటు గ్రామ సెక్రెటరీ గంగాధర్ జిపిఓ శివరాజ్ సార్ అంగన్వాడీ టీచర్ లక్ష్మీబాయి సిద్దయ్యప్ప స్వామి వీరభద్ర వినాయక్ మాధవరావు రాచయప్ప స్వామి గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఇ-పేపర్