జనం న్యూస్ అక్టోబర్ 2 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి జాతిపిత మహాత్మా గాంధీజీ జయంతి సందర్భంగా కూకట్పల్లి నియోజకవర్గంలోని వివిధ డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గాంధీజీ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు డివిజన్ అధ్యక్షుల ఆధ్వర్యంలో మూసాపేట్, ఉమ్మడి అల్లాపూర్, గాయత్రి నగర్ మరియు కేపీహెచ్బీ రోడ్ నంబర్-1లోని మహాత్మా గాంధీజీ విగ్రహాలకు టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ మరియు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ బండి రమేష్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ, మహాత్మా గాంధీజీ చూపిన సత్యం, అహింస, శాంతి మరియు సేవా మార్గాలు నేటి సమాజానికి కూడా స్ఫూర్తిదాయకమని, ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని అన్నారు. స్వాతంత్ర్య సమరంలో గాంధీజీ చేసిన మహోన్నత త్యాగాలను స్మరించుకుంటూ, ఆయన కలలు కన్న సమసమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, డివిజన్ అధ్యక్షులు, మహిళా నాయకురాళ్లు, స్థానిక నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.