తెలంగాణ

గాంధీజీ ఆశయాలను ఆచరించడమే ఆయనకు నిజమైన నివాళిసత్యం, అహింస మార్గంలో సమాజం ముందుకు సాగాలి

గాంధీజీ ఆశయాలను ఆచరించడమే ఆయనకు నిజమైన నివాళిసత్యం, అహింస మార్గంలో సమాజం ముందుకు సాగాలి

జనం న్యూస్ అక్టోబర్ 2 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొన్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు, తెలంగాణ కమ్మ కార్పొరేషన్ చైర్మన్, కూకట్ పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్ భరత్ నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు మరియు కూకట్ పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఏ బ్లాక్ అద్యక్షులు డా. పి నాగిరెడ్డి కూకట్ పల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, వివిధ కార్యక్రమాల ద్వారా నిర్వహించిన మహాత్మా గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొని గాంధీజీ చూపిన సత్యం, అహింస, శాంతి, సేవా మార్గాలను స్మరించుకున్నారు. మహాత్మా గాంధీ దేశానికి స్వాతంత్ర్యం సాధించడమే కాకుండా, సత్యం, అహింస, సామాజిక సమానత్వం, పరిశుభ్రత వంటి విలువలను సమాజానికి అందించారని అన్నారు. గాంధీజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ జీవితంలో ఆచరించడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. కాలనీ లోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళిని హార్పించారు.

ఇ-పేపర్