జనం న్యూస్ అక్టోబర్ 2 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా నేడు విడుదలై ప్రేక్షకుల విశేష ఆదరణతో ఘనవిజయం సాధించిన ‘అనకాపల్లి’ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రత్యేక సత్కార కార్యక్రమం నిర్వహించారు. మన ప్రాంతం పేరుమీద తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల మనస్సులను దోచుకోవడం ఎంతో సంతోషకరమని ప్రతినిధులు కొనియాడారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర కార్పొరేషన్ చైర్మన్, భీమిలి నియోజకవర్గ టిడిపి పరిశీలకులు, ప్రముఖ వ్యాపారవేత్త మళ్ళ సురేంద్ర చిత్ర బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. ప్రముఖ చలనచిత్ర దర్శకులు నక్కిన త్రినాథరావు ని, అలాగే చిత్ర నిర్మాతలు కాండ్రేగుల నాయుడు, రాజబాబు, సోమేశ్, మరియు నక్కిన సురేష్ లను ఆయన దుశ్శాలువాలతో, ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మళ్ళ సంతోష్, కె. లక్ష్మణరావు, మద్దాల కృష్ణ, కొడుకుల శ్రీకాంత్, ఎస్. భానుచందర్ (అఖి), తరుణ్, జొన్నాడ సురేష్, వెంకటేష్, హేమంత్, జస్వంత్, సాయిలతో పాటు వారి తల్లిదండ్రులు, పలువురు ముఖ్య నాయకులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.//