సుప్రసిద్ధ చిత్రకారులు రుస్తుం జనం న్యూస్; 2 అక్టోబర్ శుక్రవారం: సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్ ;గాంధీ జయంతి 2 అక్టోబర్ ను పురస్కరించుకుని రుస్తుం ఆర్ట్ గ్యాలరీలో నేడు బుధవారం, మహాత్ముని మార్గం మానవజాతికి సన్మార్గం, చిత్రాన్ని అంతర్జాతీయ చిత్రకారులు రుస్తుం ఆవిష్కరించారు. మాట్లాడుతూ ముందుగా అందరికీ గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మహాత్ముడు మొహన్ దాస్ కరంచంద్ గాంధీ లేని స్వాతంత్య్ర భారత దేశాన్ని ఊహించలేం, అతడు నమ్మిన సత్యమేవ జయతే ప్రతిపాదించిన అహింస సత్యాగ్రహం భారతదేశానికి స్వాతంత్య్రం తెచ్చిపెట్టి ప్రపంచ దేశాలకు మార్గ దర్శకుడైనాడు మహాత్ముని అడుగుజాడలే మానవ జాతి మనుగడ ఐక్యతకు ఉప యోగపడే సన్మార్గం. ప్రతి మనిషి మనిషిగ బతుకేందుకు అహింస, సత్యాగ్రహం, మానవతా ఆయుధాలు, మానవాళికి రక్షణ కవచాలు. అతడు చూపిన సన్మార్గం బోధనలు ప్రతి భారతీయునికి ప్రపంచ దేశాలకు శిరోధార్యం ఈశ్వర్ అల్లా తేరేనామ్ సబ్కోసమ్మతి దే భగవాన్, మహాత్మాగాంధీ బోధనలు తీసుకొని తెలంగాణలో ఎన్నో ప్రజాహిత సంక్షేమ పథకాలు అమలుచేస్తూ, కులమతాలకు అతీతంగా దీనుల్లోదైవత్వం చూస్తూ “ఆసరా” గా నిలుస్తూ ప్రపంచానికే రోల్ మాడలుగా వాస్తవ విమర్శకుల ప్రశంసలు మన్ననలు అందుకోవాలన్నారు. అందరూ గాంధీ జయంతిని స్పూర్తిగా తీసుకొని ప్రపంచం లోనే అత్యంత ఉత్తమ మైన దేశం శాంతి, ఐక్యత, లౌకికత్వం, సహజీవనంతో భారతదేశం వర్ధిల్లాలని యువత కంకణ బద్దులు కావలని మానవతా చిత్రకారులు రుస్తుం ఆకాక్షించారుఈ కార్యక్రమంలో ఆర్ ఎ ఎఫ్ అధ్యక్షురాలు జులేఖరుస్తుం, నైరూప్య చిత్రకారుడు నహీంరుస్తుం, అసిస్టెంట్ ప్రొఫెసర్ రుబీనారుస్తుం, మహ్మద్ రహీం, తదితరులు పాల్గొన్నారు.