ఆంధ్రప్రదేశ్

ఘనంగా మహాత్ముడి 157వ జయంతి & శాస్త్రి 122 వ జయంతి వేడుకలు

ఘనంగా మహాత్ముడి 157వ జయంతి & శాస్త్రి 122 వ జయంతి వేడుకలు

మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన అనకాపల్లి డీఎస్పీ జనం న్యూస్ అక్టోబర్ 2 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ జాతిపిత మహాత్మా గాంధీ 157వ జయంతి మరియు భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి 122వ జయంతిని పురస్కరించుకుని అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఆదేశాల మేరకు అనకాపల్లి సబ్ డివిజన్ డీఎస్పీ ఈ.శ్రీనివాసులు ఆ మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాసులు మాట్లాడుతూ, అహింస, సత్యం అనే ఆయుధాలతో బ్రిటిష్ పాలనకు ఎదురొడ్డి శాంతియుత పోరాటంతో దేశానికి స్వాతంత్య్రం సాధించిపెట్టిన మహోన్నత నేత మహాత్మా గాంధీ అని కొనియాడారు. నాలుగు దశాబ్దాల పాటు సాగిన ఆయన సుదీర్ఘ పోరాట పటిమ బ్రిటిష్ సామ్రాజ్యాన్నే తలవంచేలా చేసిందన్నారు. ప్రపంచ యవనికపై చెరగని ముద్ర వేసిన బాపూజీ ఆలోచనా విధానం, ఆయన బోధించిన గాంధీయిజం నేటికీ ప్రపంచ దేశాలకు మార్గదర్శకమని పేర్కొన్నారు. గ్రామ స్వరాజ్యం, స్వదేశీ విధానం, సామాజిక సామరస్యం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని గుర్తుచేశారు. అలాగే, నిరాడంబరత, నిజాయితీలకు మారుపేరైన మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి దేశానికి చేసిన సేవలను ఆయన స్మరించుకున్నారు. జై జవాన్ – జై కిసాన్” అనే నినాదంతో దేశ రక్షణ, ఆహార భద్రత ప్రాధాన్యతలను చాటిచెప్పి జాతిని నడిపించిన మహనీయుడు శాస్త్రి అని కొనియాడారు. ఈ ఇద్దరు మహనీయుల ఆదర్శాలు, త్యాగాలు దేశ ప్రజలందరికీ నిత్య స్ఫూర్తిదాయకమని పిలుపునిచ్చారు. ​ఈ కార్యక్రమంలో డీఎస్పీ తో పాటు సీఐలు బాల సూర్యారావు, చంద్రశేఖర్, ఎస్సై మనోజ్ కుమార్ మరియు జిల్లా పోలీసు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.//

ఇ-పేపర్