తెలంగాణ

కుమ్మర కుటుంబాలకు ఆర్థికంగా ప్రభుత్వం చేయూతనివ్వాలి

కుమ్మర కుటుంబాలకు ఆర్థికంగా ప్రభుత్వం చేయూతనివ్వాలి

మట్టి పాత్రలకు ప్రభుత్వ విభాగాల్లో ప్రాధాన్యత కల్పించాలి

జనం న్యూస్ : వనపర్తి డివిజన్ రీపోటర్ కటికల శివకుమార్ వనపర్తి. అక్టోబర్ 05 సోమవారం తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం (TRKS) అధ్యక్షులునడికుడి జయంత్ రావు,రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఏడుకొండల వెంకటేశం,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయానంద పిలుపుమేరకు వనపర్తి జిల్లా. కుమ్మర సంఘం అధ్యక్షులు సుగురు రాములు. ప్రధాన కార్యదర్శి. సూర్యవంశం పరుశరాముడు. పిలుపుమేరకు. పెబ్బేరు మండలంలో వివిధ గ్రామాలలో కుమ్మరి వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న వృత్తిదారులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ, పెబ్బేరు మండల కుమ్మర సంఘం అధ్యక్షుడు సూర్యవంశం హర్షవర్ధన్. యూత్ అధ్యక్షుడు సూర్యవంశం సురేష్ ఆధ్వర్యంలో సోమవారం ప్రజావాణిలో వినతి పత్రం ఎంపీడీవో వెంకటేశ్వర్లు కు అందజేశారు. మండల అధ్యక్షుడు మాట్లాడుతూ కుమ్మరి వృత్తిదారులకు ప్రధానంగా అవసరమైన బంకమట్టిని సేకరించడం, రవాణా చేసుకోవడం ప్రస్తుతం భారంగా మారిందని తెలిపారు. ప్రభుత్వం బంకమట్టిని ఉచితంగా అందించడంతో పాటు, గ్రామాలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలని అన్నారు. యూత్ అధ్యక్షులు సురేష్ మాట్లాడుతూ. వృత్తిదారులు తయారు చేస్తున్న మట్టి కుండలు,ప్రమిదలు, దీపాలు, కూజాలు,మట్టి గణపతి విగ్రహాలు తదితర సంప్రదాయ వస్తువులకు ప్రభుత్వం ప్రత్యేక మార్కెట్‌ వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరారు. సంక్షేమ పథకాలు, ఇచ్చి ప్రభుత్వం కుమ్మరలను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో. మండల యూత్ ప్రధాన కార్యదర్శి ఎన్కిచర్ల శ్రీనివాసులు. ప్రచార కార్యదర్శి ధర్మ తేజ. కుమ్మరి కుల బంధువులు కుమ్మరి శ్రీరాములు. రాజు. వెంకటేష్. ప్రజలు పాల్గొన్నారు.

ఇ-పేపర్