జనం న్యూస్ అక్టోబర్ 8 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి డ్రీమ్ వ్యూ కాలనీలో ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న డ్రైనేజీ సమస్యను కాలనీవాసులు టీపీసీసీ వైస్-ప్రెసిడెంట్, కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ దృష్టికి తీసుకురావడం జరిగింది. కాలనీవాసుల సమస్యను పరిష్కరించేందుకు బండి రమేష్ సంబంధిత అధికారులతో మాట్లాడి, డ్రైనేజీ సమస్యకు పరిష్కారం చూపేలా చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా ఈరోజు డ్రైనేజీ పనులు ప్రారంభమయ్యాయి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బండి రమేష్ హాజరై కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలకు మౌలిక వసతులు కల్పించడం కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధుల ప్రధాన బాధ్యత అని, కాలనీవాసులు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యను అధికారుల సహకారంతో పరిష్కరించడం సంతోషంగా ఉందని తెలిపారు. ప్రజలకు ఎలాంటి సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రెసిడెంట్ కిల్లారు శ్రీనివాస బాబు, కాలనీ ప్రెసిడెంట్ తాకినేని రవికుమార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాకినేని వినోద్ కుమార్, రామారావు, కోటారి వెంకట్, కొల్లి సత్యనారాయణ, సురేష్, రాంబాబు, రాజు, వెంకటేష్, జానారెడ్డి, చక్రధర్, అలాగే కాలనీవాసులు చలపతి, రాజు, రవీంద్ర, వర్మ, చందు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా జీహెచ్‌ఎంసీ అధికారులు డీజీఎం త్రినాథరావు హెచ్‌ఎండబ్ల్యూఎస్ మేనేజర్ మమత తదితర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న డ్రైనేజీ సమస్యను పరిష్కరించినందుకు కాలనీవాసులు బండి రమేష్ కి కృతజ్ఞతలు తెలిపారు.