ఆంధ్రప్రదేశ్

రాహుల్ గాంధీని అదుపులోకి తీసుకోవడంపై భారీ నిరసనలు

రాహుల్ గాంధీని అదుపులోకి తీసుకోవడంపై భారీ నిరసనలు

జిల్లావ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల ఆందోళనలకు పిలుపు – జుక్కల్‌లో NH-161పై జుక్కల్ చౌరస్తా వద్ద భారీ ధర్నా జుక్కల్, అక్టోబర్ 08: జనం న్యూస్ఢి ల్లీలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తో పాటు INDIA కూటమి ఎంపీలను పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటనపై కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. AICC–TPCC ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లా DCC అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ పిలుపుతో జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు, మండలాల్లో భారీ నిరసన కార్యక్రమాలకు కాంగ్రెస్ శ్రేణులు శ్రీకారం చుట్టాయి. కామారెడ్డి జిల్లా నిరసన కార్యక్రమాల్లో భాగంగా జుక్కల్ నియోజకవర్గంలో భారీ స్థాయిలో కాంగ్రెస్ ధర్నా నిర్వహించారు. జుక్కల్ చౌరస్తా NH-161 వద్ద జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు , కామారెడ్డి జిల్లా DCC అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నల్లచొక్కాలు ధరించిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు జుక్కల్ చౌరస్తా వద్ద NH-161పై భారీగా తరలివచ్చి రాహుల్ గాంధీ ని అదుపులోకి తీసుకున్న ఘటనను తీవ్రంగా ఖండించారు. “ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి” “రాహుల్ గాంధీకి న్యాయం చేయాలి” “కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఖండిస్తున్నాం” అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కామారెడ్డి జిల్లా నుంచి బలమైన నిరసన గళం ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ప్రజాస్వామ్య హక్కులు, ఓటు హక్కు, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రజల తరఫున ప్రశ్నించే ప్రతిపక్ష నాయకులు, ఎంపీలను అదుపులోకి తీసుకోవడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని వారు పేర్కొన్నారు. రాహుల్ గాంధీ తో పాటు ఇండియన్ కూటమి ఎంపీలను అదుపులోకి తీసుకున్న ఘటనకు నిరసనగా కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరింత విస్తృతంగా ఆందోళనలు చేపడతామని నాయకులు స్పష్టం చేశారు. జుక్కల్ నుంచి మార్మోగిన కాంగ్రెస్ నినాదాలు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు – DCC అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ నాయకత్వంలో జరిగిన ఈ భారీ ధర్నాతో జుక్కల్ చౌరస్తా కాంగ్రెస్ నినాదాలతో మార్మోగింది. జుక్కల్‌లో జరిగిన ఈ భారీ నిరసన కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ శ్రేణుల ఐక్యతకు, పోరాట స్ఫూర్తికి ప్రతీకగా నిలిచింది. 🇮“ప్రజాస్వామ్య పరిరక్షణే కాంగ్రెస్ లక్ష్యం” కామారెడ్డి జిల్లా నుంచి జుక్కల్ వరకు ఒక్కటైన కాంగ్రెస్ శ్రేణులు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాటానికి సిద్ధమంటూ బలమైన సందేశం ఇచ్చాయి. జిల్లావ్యాప్తంగా నిరసనలు కొనసాగనున్న నేపథ్యంలో, జుక్కల్‌లో జరిగిన ఈ భారీ ధర్నా కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ ఉద్యమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఇ-పేపర్