మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే జుక్కల్ అక్టోబర్ 9 జనం న్యూస్కా మారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం పిట్లం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ బి ఆర్ఎస్ (BRS) పార్టీ ఆధ్వర్యంలో నాయకులు, రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జుక్కల్ నియోజకవర్గ మాజీ శాసన సభ్యులు హన్మంత్ షిండే రైతులకు మద్దతు ప్రకటిస్తూ, పంటలు ఎండిపోకుండా రైతులకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులకు సాగునీటి అవసరాలకు అనుగుణంగా విద్యుత్ సరఫరా చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల పంటలను కాపాడేందుకు ప్రభుత్వం తక్షణమే స్పందించి, నిరంతర విద్యుత్ సరఫరా అందించాలని డిమాండ్ చేశారు. రైతుల పక్షాన. బి ఆర్ఎస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని, రైతులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని హన్మంత్ షిండే స్పష్టం చేశారు.