తెలంగాణ

కళారంగంలో బత్తుల హరీష్‌కు మహానంది పురస్కారం ఘనంగా సత్కరించిన విశ్వ తేజస్ బృందం

కళారంగంలో బత్తుల హరీష్‌కు మహానంది పురస్కారం ఘనంగా  సత్కరించిన విశ్వ తేజస్ బృందం

జనం న్యూస్ యానంపల్లి: నిజామాబాద్ జిల్లా యానంపల్లి గ్రామానికి చెందిన కళాకారుడు బత్తుల హరీష్‌కు కళారంగంలో విశేష కృషి చేసినందుకు మహానంది పురస్కారం లభించింది. తెలుగు సాహితీ సంస్కృతి సేవా ట్రస్ట్, ఆంధ్రప్రదేశ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంయుక్త ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని పబ్లిక్ లైబ్రరీలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు. బత్తుల హరీష్‌ ప్రేమకావ్యం, అఘోర చిత్రాల్లో నటించి తన నటనా ప్రతిభను చాటుకున్నారు. కళారంగంపై ఆసక్తి, అంకితభావంతో ముందుకు సాగుతున్న ఆయనకు ఈ పురస్కారం లభించడంతో పలువురు హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా హరీష్ సాధించిన విజయాన్ని అభినందిస్తూ విశ్వ తేజస్ బృందం ఆయనను ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమంలో విశ్వ తేజస్ సంస్థ వ్యవస్థాపకులు తిరునగరి శ్రీహరి మాట్లాడుతూ.. కళారంగంపై హరీష్‌కు ఉన్న అంకితభావం, కళాతృష్ణ అభినందనీయమని పేర్కొన్నారు. పట్టుదలతో తన కళా ప్రయాణాన్ని కొనసాగిస్తూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

ఇ-పేపర్