తెలంగాణ

జీవీఎంసీ 111 వ వార్డులో కొణతాల రామకృష్ణ విస్తృత ప్రచారం

జీవీఎంసీ 111 వ వార్డులో కొణతాల రామకృష్ణ విస్తృత ప్రచారం

కూటమి అభ్యర్థి పలక యశోద రవి ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి

జనం న్యూస్ అక్టోబరు 28 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ అనకాపల్లి జీవీఎంసీ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మాజీ మంత్రివర్యులు, అనకాపల్లి శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ జీవీఎంసీ 111వ వార్డులో విస్తృత ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయరామరాజుపేట పరిసర ప్రాంతాల్లో కూటమి బిజెపి కార్పొరేటర్ అభ్యర్థి పలకా యశోద రవి తో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించి ప్రజలను కలుసుకొని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ప్రజలు మద్దతు తెలిపి విజయాన్ని అందించాలని కోరారు. ఈ కార్యక్రమం ద్వారా ఆయా ప్రాంతాల్లో కూటమి తరఫున ఎన్నికల ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహించారు. కార్యక్రమంలో 111 వ వార్డు కూటమి నాయకులు పాల్గొన్నారు.

ఇ-పేపర్