జనం న్యూస్; 26 అక్టోబర్ సోమవారం ; సిద్దిపేట నియోజి కవర్గ ఇంచార్జ్ వై .రమేష్ ;ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటానమస్, సిద్దిపేట కు చెందిన బీఎస్సీ ఫార్మాస్యూటికల్ మాన్యుఫ్యాక్చరింగ్ అండ్ క్వాలిటీ ప్రథమ సంవత్సరం విద్యార్థి శ్రీ అడిపు కార్తీక్ ఇటీవల అంతర్జాతీయ స్థాయి ఫ్రీస్టైల్ రెజ్లింగ్‌లో అండర్–65 కేజీల విభాగంలో విజేతగా నిలిచి ఎంపికైన సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి. సునీత గారు ఘనంగా సన్మానించారు. స్పోర్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మరియు రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా 2026 అక్టోబర్ 21 నుంచి 23 వరకు పంజాబ్‌లోని చండీగఢ్‌లో నిర్వహించిన ఫ్రీస్టైల్ అంతర్జాతీయ రెజ్లింగ్ ఎంపిక పోటీల్లో అండర్–65 కేజీల విభాగంలో విజేతగా నిలిచి విద్యార్థి తన ప్రతిభను చాటుకున్నాడు. ఈ విజయంతో కళాశాలకు గర్వకారణంగా నిలిచిన విద్యార్థిని ప్రిన్సిపాల్ అభినందించి, అతని కృషి, పట్టుదల, క్రీడా స్ఫూర్తిని ప్రశంసించారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించి ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. విద్యార్థి సాధించిన ఈ విజయాన్ని స్ఫూర్తిగా తీసుకొని మిగతా విద్యార్థులు కూడా పట్టుదలతో ముందుకు సాగుతూ తమ ప్రతిభను నిరూపించుకోవాలని పిలుపునిచ్చారు.ఈ సన్మాన కార్యక్రమం కళాశాలలో ఇంచార్జ్ ఫిజికల్ డైరెక్టర్ జి. బాలకిషన్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ అయోధ్య రెడ్డి, సిఓఈ డాక్టర్ గోపాల సుదర్శనం, రసాయన శాస్త్ర విభాగం ఇంచార్జ్ డాక్టర్ ఎం శ్రీధర్ మరియు అధ్యాపకులు డాక్టర్ జి.రవికుమార్, డాక్టర్ కె. భాస్కర్, డాక్టర్ జి. శ్రీనివాస్, కె. ఆంజనేయులు, డాక్టర్ వి. బాలకిషన్, డాక్టర్ వి. మనోహర్, డాక్టర్ కే. రవికుమార్, శ్రీకాంత్, చైతన్య, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.