తెలంగాణ

కొల్లూరులో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం

కొల్లూరులో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం

సబ్ టైటిల్ : – ముఖ్య అతిథిగా ఝరాసంగం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉదయ్ శంకర్ పటేల్

జనం న్యూస్, 26 అక్టోబర్, ఝరాసంగం మండలం, కొల్లూరు గ్రామం, ( జహీరాబాద్ నియోజకవర్గం ప్రతినిధి చింతలగట్టు నర్సిములు ) సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గం, ఝరాసంగం మండల పరిధిలోని కొల్లూరు గ్రామానికి చెందిన చింతల గట్టు అమృతమ్మ భర్త దావీదు, దంపతులు నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ గృహప్రవేశ కార్యక్రమానికి ఝరాసంగం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉదయ్ శంకర్ పాటిల్ ముఖ్య అతిథిగా, హాజరయ్యారు. నూతన గృహంలోకి ప్రవేశించిన దంపతులను ఆయన అభినందించారు. ఈ సందర్భంగా ఉదయ శంకర్ పాటిల్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, రేషన్ కార్డులు, తదితర అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభూత్వ పథకాలు అందేలా కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఇ-పేపర్