జనం న్యూస్ అక్టోబర్ 26 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి ఆల్విన్ కాలనీ డివిజన్ బిజెపి అధ్యక్షులు చిన్నగాలొల్ల రాజు ఆధ్వర్యంలో ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండ లో ఉన్న హిందూ స్మశాన వాటిక మరియు రోడ్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బిజెపి యువమోర్చా రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు కుమార్ యాదవ్, బిజెపి రాష్ట్ర నాయకులు నరేందర్ రెడ్డి, కమలాకర్ రెడ్డి మరియు స్థానిక నాయకులతో కలిసి సిఎంసి ఆల్విన్ కాలనీ (51) సర్కిల్ డిప్యూటీ కమిషనర్ చాముండేశ్వరి ని కలిసి వినతిపత్రం అందజేశారు. సందర్భంగా కుమార్ యాదవ్ మాట్లాడుతూ స్మశాన వాటిక సమస్య ఏండ్ల తరబడి ఉన్న ప్రభుత్వ అధికారులు పట్టించుకోకపోవడం బాధాకరమైన విషయం అన్నారు. కోట్ల రూపాయలు అభివృద్ధి పేరిట వచ్చినా పంచుకోవడమే తప్ప ప్రజలకు స్మశాన వాటికను అందుబాటులోకి తీసుకురాలేదు అన్నారు. ఎల్లమ్మబండ ప్రాంతంలో ఎవరు మరణించిన కిలోమీటర్ల దూరం తీసుకెళ్లే దుస్థితి మరియు చివాట్లతో దహన సంస్కారాలు చేసుకునే దుస్థితి ఉంది అన్నారు. అందుబాటులో స్మశాన వాటిక ఉన్న అభివృద్ధికి నోచుకోక ప్రజలు అవస్థలు పడుతున్న వ్యవస్థలో మార్పు లేకపోవడం దుర్మార్గమైనది అన్నారు. ఇప్పటికైనా వెంటనే పూర్తి మరమ్మత్తులు చేసి స్మశాన వాటికను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. లేనిపక్షంలో స్మశాన వాటికలో బిజెపి ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలను నిరసన కార్యక్రమాలను తీవ్రతరం చేస్తాం అన్నారు. అలాగే డివిజన్లో రోడ్ల సమస్యలు కూడా పరిష్కరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా మోర్చా జిల్లా నాయకురాలు జ్యోతి, డివిజన్ బిజెపి నాయకులు రమేష్, కమల్, ప్రవీణ్, హరీష్ తదితరులు పాల్గొన్నారు…..
