తెలంగాణ

మౌంట్ అబూలో బోయిన గోవిందరాజులు, శారదా దంపతులకు గౌరవం

మౌంట్ అబూలో బోయిన గోవిందరాజులు, శారదా దంపతులకు గౌరవం

జనం న్యూస్ అక్టోబర్ 26 కోటబొమ్మాళి:రాజస్థాన్‌లోని మౌంట్ అబూలో ఓం శాంతి సంస్థ 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో, సంస్థ టోటల్ అడ్మినిస్ట్రేటర్ మృత్యుంజయ్ భాయ్ చేతుల మీదుగా చైర్మన్ బోయిన గోవిందరాజులు, శారదా దంపతులకు ఘనంగా సన్మానించి సత్కరించారు . సమాజసేవ, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుకుగా భాగస్వాములవుతూ, వెనుకబడిన వర్గాలు, పేద ప్రజల అభ్యున్నతికి సేవలందిస్తున్న బోయిన గోవిందరాజులు, శారదా దంపతులను ఈ సందర్భంగా అభినందించారు. వారితో కలిసి సేవా కార్యక్రమాల్లో భాగస్వాములవుతున్న కోట బొమ్మాళికి చెందిన పెద్దలు, అలాగే కోటబొమ్మాళి సంస్థ ప్రతినిధులు ఈశ్వరి అక్క, లోకేష్ అన్నయ్యల సేవలను కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా గుర్తుచేసుకున్నారు. ఓం శాంతి సంస్థ స్థాపించి 90 సంవత్సరాలు పూర్తిచేసుకున్న ఈ శుభ సందర్భంలో సత్కారం జరగడం ఎంతో ఆనందదాయకమని,సమాజసేవకు మరింత స్ఫూర్తినిచ్చే విషయమని పలువురు పేర్కొన్నారు.

ఇ-పేపర్