జనం న్యూస్26/10/2026 సంగారెడ్డిలో తెలంగాణ యువజన జర్నలిస్టుల సంఘాల ఫెడరేషన్ (TYJF) తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మెహబూబ్ జన్మదిన వేడుకలు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జర్నలిస్ట్ మిత్రుల మధ్య అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, విలేకరులు పెద్ద సంఖ్యలో హాజరై ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా తెలంగాణ యువజన సంఘాల సమితి అధ్యక్షులు కూన వేణు హాజరయ్యారు. ఈ సందర్భంగా కూన వేణు మాట్లాడుతూ -సమాజ హితం కోసం, ప్రజా సమస్యలను వెలుగులోకి తేవడానికి అహర్నిశలు శ్రమిస్తున్న జర్నలిస్టుల పాత్ర అభినందనీయమని కొనియాడారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం, వారి హక్కుల సాధన కోసం TYJF ఎల్లప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు. షేక్ మెహబూబ్ నిరంతరం ప్రజా సమస్యలపై స్పందిస్తూ, యువతను మరియు జర్నలిస్టులను సమాయత్తం చేస్తూ ముందుకు సాగుతున్నారని ప్రశంసించారు. ఆయన మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ జన్మదిన వేడుకలలో పలువురు జర్నలిస్ట్ నాయకులు, వివిధ నియోజకవర్గాల ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు సంగారెడ్డి పట్టణంలో షేక్ మహబూబ్ ను శాలువాతో సన్మానించి, పుష్పగుచ్ఛం అందజేసి జన్మదినశుభాకాంక్షలు తెలిపిన సంగారెడ్డి ఎమ్మెల్యే కాంటెస్టెడ్ అభ్యర్థిసంగారెడ్డి పట్టణంలోని రెడ్లస్ హోటల్లో తెలంగాణ యూత్ ఫెడరేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మహబూబ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంగారెడ్డి ఎమ్మెల్యే కాంటెస్టెడ్ అభ్యర్థి పులిమామిడి రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా షేక్ మహబూబ్‌ను శాలువాతో ఘనంగా సన్మానించి, పుష్పగుచ్ఛం అందజేసి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం పులిమామిడి రాజు మాట్లాడుతూ, షేక్ మహబూబ్ మీడియా రంగంలో అంచెలంచెలుగా ఎదుగుతూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటున్నారని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ఆయన మరింత ఉన్నత స్థాయికి ఎదిగి, మరిన్ని ఉన్నత పదవులను అధిరోహించాలని ఆకాంక్షించారు. ప్రజలకు, సమాజానికి మరింత సేవ చేయాలని కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జానారెడ్డి. వీరేశం. సంగారెడ్డి. తెలంగాణ రాష్ట్ర యూత్ ఫెడరేషన్ (TYJF) నాయకులు, మీడియా మిత్రులు, పాత్రికేయులు, షేక్ మహబూబ్ అభిమానులు సంఖ్యలో పాల్గొన్నారు