ఎఐ కేఎంఎస్ జిల్లా అధ్యక్షులు మహేందర్.
జనం న్యూస్ అక్టోబర్ 27, వికారాబాద్ జిల్లా అఖిల భారత రైతు కూలి సంఘం ( ఎ ఐ కే ఎం ఎస్ ) ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా కేంద్రంలో అమరవీరుల స్తూపం వద్ద నిరసన కర్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఎ ఐ కే ఎం ఎస్ జిల్లా అధ్యక్షులు వై మహేందర్ మాట్లాడుతూవికారాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని వర్షాభావంతో నష్టపోయిన రైతులకు పంట నష్టపరిహారం వెంటనే ఇచ్చి రైతులను ఆదుకోవాలి.రైతుల యొక్క పాత రుణాలను మాఫీ చేసి వెంటనే కొత్త రుణాలు ఇవ్వాలి. వ్యవసాయానికి 16 గంటల విద్యుత్ సౌకర్యాన్ని కల్పించాలి. మేత కోసం అల్లాడుతున్న పశువులకు పశుగ్రాసం మరియు పశువులకు త్రాగునీటిని ఏర్పాటు చేయాలి. పంటలు నష్టపోవడంతో గ్రామాలలో వ్యవసాయ పనులు తగ్గిపోవడం వల్ల వ్యవసాయ పనులు లేక అల్లాడుతు న్నటువంటి ప్రజలకు వెంటనే ఉపాధి హామీ పనులు ప్రారంభించి ఆదుకోవాలి అదేవిధంగా ఉపాధి హామీ కూలి రేట్లు కూడా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పెంచాలి. నిత్యావసర సరుకుల ధరలన్నీ కూడా పేద ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ధరలు తగ్గించాలి.అని అన్నారు. జిల్లావ్యాప్తంగా రైతులను, వ్యవసాయ కూలీలను, కౌలు రైతులను ఆదుకోవడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు చేసి వికారాబాద్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని ఏఐకేఎంఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో డిమాండ్ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ నాయకులు రాములు,గోపాల్, శ్రీకాంత్, జైపాల్, కృష్ణ , బాలరాజ్ ,ప్రమోద్ దితరులు పాల్గొన్నారు.