తెలంగాణ

టి వై జె ఎఫ్ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా ఝాన్సీ నియామకం

టి వై జె ఎఫ్ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా ఝాన్సీ నియామకం

జనం న్యూస్ 27/10/2026 సంగారెడ్డి:** తెలంగాణ యూత్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టి వై జె ఎఫ్) రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా ఝాన్సీ నియమితులయ్యారు.టి వై జె ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు డా. తనుగుల జితేందర్ రావు ఆదేశాల మేరకు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మెహబూబ్ ఆధ్వర్యంలో ఝాన్సీను రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా నియమించారు. ఈ సందర్భంగా ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం, యువ జర్నలిస్టుల సంక్షేమం కోసం టి వై జె ఎఫ్ మరింత బలోపేతంగా పనిచేయాలని ఆకాంక్షించారు. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ ఫెడరేషన్ అభివృద్ధికి కృషి చేయాలని ఝాన్సీను అభినందించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజనల సంఘం అధ్యక్షుడు డాక్టర్ కోన వేణురాష్ట్ర సెక్రటరీ జగత్ కృష్ణటి వై జె ఎఫ్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు సంతోష్ కుమార్ గుప్తా వర్కింగ్ ప్రెసిడెంట్ భాగయ్య తదితరులు పాల్గొన్నారు.

ఇ-పేపర్