తెలంగాణ

కూటమి అభ్యర్థులను గెలిపించండి: బీజేపీ సీనియర్ నాయకులు నీరుకొండ వీరన్న చౌదరి

కూటమి అభ్యర్థులను గెలిపించండి: బీజేపీ సీనియర్ నాయకులు నీరుకొండ వీరన్న చౌదరి

ప్రతి ఇంటికీ తిరిగి ఓట్లు అభ్యర్థించి గెలుపును బహుమతిగా ఇవ్వండి: కార్యకర్తలకు పిలుపు

జనం న్యూస్ అక్టోబర్ 27 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కూటమి తరపున పోటీ చేసిన ఎంపీటీసీ అభ్యర్థులకు మీ వంతు సహాయ సహకారాలు అందించి, ఎన్నికలు అయ్యే వరకు మీ మీ గ్రామం, మండలంలోనే ఉండి వారి గెలుపు కోసం కృషి వంచన లేకుండా పని చేసి గెలుపును బహుమతిగా ఇవ్వాలని సీతానగరం బీజేపీ సీనియర్ నాయకులు నీరుకొండ వీరన్న చౌదరి పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. జనసేన, తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం మీరు ప్రతి ఇంటికీ తిరిగి ఓట్లు అభ్యర్థించే విధానాన్ని చూసి, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు రానున్న రోజుల్లో మిమ్మల్ని గ్రామ సర్పంచ్‌లుగా నిలబెట్టాలనే విధంగా మీ ప్రవర్తన ఉండాలని, వారి మనసు దోచుకునేలా కృషి చేయాలని కోరారు. రాజానగరం నియోజకవర్గంలో కూటమి బలం రోజురోజుకూ పెరుగుతోందని, ప్రజలు అభివృద్ధి కోసం కూటమి వైపే చూస్తున్నారని ఆయన అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి కూటమికి మద్దతు కూడగట్టాలని సూచించారు. కార్యకర్తల కృషి, సమన్వయమే రాబోయే ఎన్నికల్లో కూటమికి ఘన విజయాన్ని అందిస్తుందని వీరన్న చౌదరి ధీమా వ్యక్తం చేశారు.

ఇ-పేపర్