వైరల్ వార్తలు

సుబ్బరాజు అపార్ట్మెంట్లో కూటమి ఆత్మీయ సమావేశం – దాట్ల సుబ్బరాజుకు మద్దతుగా ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు

సుబ్బరాజు అపార్ట్మెంట్లో కూటమి ఆత్మీయ సమావేశం – దాట్ల సుబ్బరాజుకు మద్దతుగా ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు

26వ వార్డు బీజేపీ అభ్యర్థి విజయానికి కూటమి శ్రేణుల సమిష్టి కృషి


జనం న్యూస్ అక్టోబర్ 27 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ అమలాపురం: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మున్సిపాలిటీ పరిధిలోని 26వ వార్డు బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి దాట్ల వెంకట సుబ్బరాజుకు మద్దతుగా అమలాపురం సుబ్బరాజు అపార్ట్మెంట్లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు పాల్గొన్నారు. వార్డు పరిధిలోని ఓటర్లు, అపార్ట్మెంట్ వాసులతో మమేకమై అభ్యర్థికి మద్దతు తెలపాలని కోరారు. కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర కూటమి ప్రభుత్వాలు చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, కూటమి పాలనలోనే అమలాపురం సమగ్ర అభివృద్ధి సాధ్యమని అన్నారు. 26వ వార్డులో మౌలిక సదుపాయాల కల్పనకు, ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, అందుకు అభ్యర్థి దాట్ల వెంకట సుబ్బరాజును భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలతో పాటు టీడీపీ, జనసేన కూటమి నాయకులు, కార్యకర్తలు, అపార్ట్మెంట్ వాసులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

ఇ-పేపర్