తెలంగాణ

డంపింగ్ యార్డ్ తరలింపు కోసం చేపట్టిన పాదయాత్రలో కృషి చేసిన అధ్యక్షులకు ఘన సన్మానం

డంపింగ్ యార్డ్ తరలింపు కోసం చేపట్టిన పాదయాత్రలో కృషి చేసిన అధ్యక్షులకు ఘన సన్మానం

(జనం న్యూస్) 6 నవంబర్ ఎం ఎం సి ఘట్కేసర్ ప్రతినిధి సుమన్ :డంపింగ్ యార్డ్ తరలింపు కోసం ప్రజల పక్షాన నిలబడి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ చేపట్టిన పాదయాత్రలో తమ వంతు బాధ్యతగా ఎంతో చురుకుగా పాల్గొని, పాదయాత్ర విజయవంతం కావడానికి అహర్నిశలు కష్టపడి పనిచేసిన దమ్మాయిగూడ మరియు కీసర డివిజన్ అధ్యక్షులు నరేష్ పటేల్ మరియు బాలరాజు యాదవ్ ని మేడ్చల్ నియోజకవర్గ బీజేపీ ఇన్‌చార్జ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించి, శాలువాలతో ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా ఏనుగు సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం నాయకులు, కార్యకర్తలు నిబద్ధతతో ముందుకు రావడం అభినందనీయ మని పేర్కొన్నారు. ముఖ్యంగా డంపింగ్ యార్డ్ తరలింపు వంటి ప్రజలకు సంబంధించిన కీలక సమస్యపై చేపట్టిన పాదయాత్రలో నరేష్ పటేల్, బాలరాజు యాదవ్ చూపిన అంకితభావం, పట్టుదల, కష్టపడే తత్వం ఎంతో ప్రశంసనీయమని అన్నారు.ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ, ప్రజలకు అండగా నిలబడటమే భారతీయ జనతా పార్టీ కార్యకర్తల లక్ష్యమని, పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ ఐక్యంగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తను గుర్తించి గౌరవించడం మనందరి బాధ్యత అని తెలిపారు.ఈ సందర్భంగా సన్మానం పొందిన నరేష్ పటేల్ , బాలరాజు యాదవ్ కి పలువురు నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలియజేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో, ఐకమత్యంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ప్రజల కోసం పోరాటం చేసే ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు, గౌరవం లభించాలి అనే స్ఫూర్తితో ఈ సన్మాన కార్యక్రమం నిర్వహించబడింది.

ఇ-పేపర్