తెలంగాణ

గుంతకల్లు పట్టణం — టిడిపిలో చేరిన ఇండిపెండెంట్ గా గెలిచిన కౌన్సిలర్లు.కండవాలు వేసి పార్టీలోకి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ మరియు చైర్మన్ యశోద..!

గుంతకల్లు పట్టణం — టిడిపిలో చేరిన ఇండిపెండెంట్ గా గెలిచిన కౌన్సిలర్లు.కండవాలు వేసి పార్టీలోకి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ మరియు చైర్మన్ యశోద..!

(జనం న్యూస్) 6 నవంబర్ గుంతకల్లు పట్టణం రిపోర్టర్ అహ్మద్ ఖాన్,అనంతపురం జిల్లా,ఆంధ్రప్రదేశ్.గుంతకల్లు (న్యూస్) నవంబర్ 6 :: ఈ రోజు దినం 06/11/2026 గుంతకల్లు మున్సిపల్ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలబడి విజయం సాధించిన 41వ వార్డు స్వతంత్ర కౌన్సిలర్ కృష్ణ నాయక్ మరియు 43వ వార్డు స్వతంత్ర కౌన్సిలర్ డి.శరణ్య ఈ రోజు గుంతకల్లు మాజీ శాసన సభ్యులు రామగౌని జితేంద్ర గౌడ్ నివాసం నందు టీడీపీలోకి చేరడం జరిగింది. ఈ సందర్బంగా మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ చైర్మన్ యశోద స్వతంత్ర కౌన్సిలర్ కు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. జితేంద్ర గౌడ్ మాట్లాడుతూ ప్రజల ఆశీర్వాదాలతో గెలుపొందిన స్వతంత్ర కౌన్సిలర్లు టిడిపిలో చేరడం సంతోషకరమని,ప్రజల ఆశీర్వాదంతో స్వతంత్ర అభ్యర్థులుగా విజయం సాధించిన కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీలో చేరడం పార్టీ బలోపేతానికి మరింత బలాన్ని చేకూర్చింది.అభివృద్ధి, ప్రజాసేవే లక్ష్యంగా టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కలిసి ముందుకు సాగేందుకు తీసుకున్న ఈ నిర్ణయం అభినందనీయమన్నారు వార్డు అభివృద్ధికి కృషిచేయాలనీ ప్రజల సమస్యలను పరిష్కరించాలన్నారు. చైర్మన్ యశోద మాట్లాడుతూ మున్సిపాలిటీ అభివృద్ధి కోసం,వార్డు సమస్యలు పరిష్కారం కోసం పాటు పడతామని,అభివృద్ధి లక్ష్యంగా పనిచేద్దామన్నారు.ఈ కార్యక్రమంలో యువనాయకుడు పవన్ గౌడ్,పలువురు టిడిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఇ-పేపర్