తెలంగాణ

కైతలాపూర్‌లో రహదారి సమస్యకు పరిష్కారం

కైతలాపూర్‌లో రహదారి సమస్యకు పరిష్కారం

యూత్ కాంగ్రెస్ నాయకుల ఫిర్యాదుతో స్పందించిన సీఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు జనం న్యూస్ నవంబర్ 7 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కైతలాపూర్ కేబీహెచ్‌బీ 15వ ఫేజ్‌లోని రెయిన్‌బో వైన్స్ వెనుక భాగంలో గత కొంతకాలంగా మూసివేయబడి ఉన్న రహదారిని సీఎంసీ అధికారులు తిరిగి తెరిచారు. ఈ రహదారిని తెరవాలని స్టేట్ యూత్ కాంగ్రెస్ సెక్రటరీ జిట్టా రమ్యకృష్ణ, సునీల్ యాదవ్ గత వారం రోజుల క్రితం సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదుపై స్పందించిన సీఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు ఈరోజు క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టి రహదారిని ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ రహదారి అందుబాటులోకి రావడంతో కేబీహెచ్‌బీ 4వ ఫేజ్ నుంచి రాకపోకలు సాగించే వాహనదారులకు ఎంతో వెసులుబాటు కలగనుంది. ముఖ్యంగా ట్రాఫిక్ రద్దీ తగ్గడంతో పాటు ప్రయాణ సమయం ఆదా అవుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ప్రజా సమస్యపై స్పందించి అధికారుల దృష్టికి తీసుకెళ్లి రహదారి పునరుద్ధరణకు కృషి చేసిన జిట్టా రమ్యకృష్ణ, సునీల్ యాదవ్‌లను స్థానిక ప్రజలు అభినందించారు. ప్రజలకు ఉపయోగపడే సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.

ఇ-పేపర్