(జనం న్యూస్) 6 నవంబర్ గుంతకల్లు పట్టణం రిపోర్టర్ అహ్మద్ ఖాన్,అనంతపురం జిల్లా,ఆంధ్రప్రదేశ్.గుంతకల్లు పట్టణం :: ఈరోజు దినం 06/11/2026 గుంతకల్లు మాజీ శాసనసభ్యులు రామగౌని జితేంద్ర గౌడ్ ని తన నివాసం నందు కేశప్ప తన కుటుంబ సభ్యులు,వార్డు సభ్యులతో మర్యాదపూర్వకంగా కలిసి గుంతకల్లు మున్సిపల్ చైర్మన్ గా విజయం సాధించిన యశోద చేత కేక్ కట్ చేయించి చైర్మన్ మరియు పవన్ గౌడ్ ని, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీనాథ్ గౌడ్ ని శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు మరియు అభినందనలు తెలపడం జరిగింది. ఈ సందర్బంగా జితేంద్ర గౌడ్ కేశప్ప ని వారి కుటుంబ సభ్యులను మనపార్టీలో టీడీపీలో కొనసాగాలని పార్టీ బలోపేతం కోసం గతంలో మీరు అందించిన సేవలు నాయకత్వం మన సొంత పార్టీకి ఇప్పుడు మరింత అవసరమని మనమంతా కలిసికట్టుగా ముందుకు సాగుతూ పార్టీ విజయానికి అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేద్దామని మాజీ ఎమ్మెల్యే కొరడం జరిగింది.కేశప్ప కాదనుకుండా తన సొంత పార్టీలో కొనసాగుతానంటూ హామీ ఇస్తూ కండువా వేసుకున్నారు, అనంతరం మాజీ ఎమ్మెల్యే ని శాలువాతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.