ఆంధ్రప్రదేశ్

రైతులకు వైద్య సేవలు అందించేందుకు 50 మంది ఆశా కార్యకర్తల నియామకం

రైతులకు వైద్య సేవలు అందించేందుకు 50 మంది ఆశా కార్యకర్తల నియామకం

జనం న్యూస్ 10 నవంబర్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా డాక్టర్ విష్ణువర్ధన్ గౌడ్జో గులాంబ గద్వాల్ జిల్లా 🩺 డి యం యచ్చ్ ఓ డా. సంధ్యా కిరణ్మయి జోగులాంబ గద్వాల జిల్లా (సోమవారం) రోజున వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం, దుద్యాల్ మండల పరిధిలోని హకీంపేట్ గ్రామానికి మేఘ రైతు మేళా సదస్సు కు జిల్లా నుంచి రైతులను తరలించేందుకు అధికారులు 50 బస్సులను కేటాయించారు.ఈ నేపథ్యంలో ప్రతి బస్సుకు ఒక ఆశా కార్యకర్త చొప్పున మొత్తం 50 మంది ఆశా కార్యకర్తలను నియమించి రైతుల ప్రయాణ సమయంలో అవసరమైన వైద్య సేవలు, ప్రథమ చికిత్స అందించేల చర్యలు తీసుకోవడం జరిగింది. ఆశా కార్యకర్తలు తప్పనిసరిగ పాటించాల్సిన సూచనలు రైతులకు అత్యవసర సమయంలో ప్రథమ చికిత్స అందించేందుకు తప్పనిసరిగ ఫస్ట్ ఎయిడ్ కిట్ వెంట తీసుకెళ్లాలి. తమకు కేటాయించిన బస్సు రూట్ వివరాలను ముందుగానే తెలుసుకొని, నిర్ణీత సమయానికి విధులకు హాజరుకావాలి విధుల నిర్వహణలో ఏవైన సందేహాలు ఉంటే జాబితాలో పేర్కొన్న సంబంధిత వ్యవసాయ శాఖ ఎ ఓ అధికారులను సంప్రదించాలి రైతుల ప్రయణ సమయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండ, అవసరమైన వైద్య సేవలు అందించేందుకు సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో కృషి చేయలని పేర్కొనడం జరిగింది.

    ఇ-పేపర్